కాశ్మీర్: కారు ఆపలేదని పిల్లల్ని చంపేశారు

దేశసేవలో మునిగి తేలుతున్నారని, వారు లేనిదే దేశం లేదనీ పొగడ్తలు పొందే మన సైనికులు కాశ్మీర్ లో అమాయక పౌరులపై ఏ విధంగా రెచ్చిపోతారో తెలిపే దుర్ఘటన సోమవారం జరిగింది. సైన్యం నెలకొల్పిన చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్ చూపించినా ఆగకుండా వెళ్లిపోయారని కారుపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారు. కారు ఆగకుండా వెళ్తే టైర్లను కాల్చవచ్చు. టైర్లకు బదులు కారు విండ్ స్క్రీన్స్ కి గురిపెట్టి కాల్చడంతోనే సైనికుల ఉద్దేశం స్పష్టం అవుతోంది.…