ముంబైలో బాంబులు పేలాక పావు గంట వరకూ మొబైల్ ఫోన్లు పని చేయలేదు -మహారాష్ట్ర సి.ఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ మొబైల్ ఫోన్ నెటవర్క్ లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబైలో జులై 13 తేదీన టెర్రిరిస్టులు బాంబులు పేల్చాక తాను అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనీసం 15 నిమిషాల వరకూ తనకు వీలు కాలేదని ఆయన తెలిపాడు. “ఇది చాలా సీరియస్ విషయం. అధికారులతో మాట్లాడ్డానికి, ప్రభుత్వపరంగా సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మేము మొబైల్ ఫోన్లపై ఆధారపడుతున్నాం. కీలక సమయంలో ఇలా మొబైళ్ళు జామ్ అయితే ఇక ఉపయోగం ఏముంది?” అని…