అబద్ధాన్ని పదే పదే చెబితే అది…. -మొగుల్ స్ట్రిట్ ఆర్ట్
బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా. నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో…