అమెరికాలో కరువు, గత పాతికేళ్లలో ఇదే తీవ్రం
గ్లోబల్ వార్మింగ్ కు అన్ని దేశాల కంటే అధికంగా కారణంగా నిలిచిన అమెరికా ఫలితం అనుభవిస్తోంది. అనావృష్టి వలన గత పాతికేళ్ళలోనే అత్యంత తీవ్రమైన స్ధాయిలో కరువు ఏర్పడిందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపాడు. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బ తిని ఆహార ద్రవ్యోల్బణం తీవ్రం కానున్నదని అమెరికా వ్యవసాయ కార్యదర్శి టాం విల్సక్ బుధవారం పత్రికల సమావేశంలో చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. విస్తార ప్రాంతాల్లో మొక్క జొన్న, సోయా బీన్స్ లాంటి…
