నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్

మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…