పెట్టుబడిదారులకి సంక్షోభం కనిపించేది ఇలాగే -కార్టూన్
పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే ‘చక్ర భ్రమణ సంక్షోభాలు’ (cyclic crises) ప్రజల మూలుగలని పిప్పి చేసినా పెట్టుబడిదారులకి కాసులు కురవడం మాత్రం ఆగిపోదు. సంక్షోభం పేరు చెప్పి సర్కారు ఖజానాపై మరింత దూకుడుగా ఎలా వాలిపోవాలో అనేక వంచనా మార్గాలని వారు అభివృద్ధి చేసుకున్నారు; సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకి కొత్త కాదు గనక. ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల సొమ్ము భోంచేసినప్పటికీ, కంపెనీలు దానిని ఏ మాత్రం కార్మికవర్గానికి విదల్చకపోవడం వల్ల సంక్షోభం ప్రధాన ఫలితం నిరుద్యోగమే అవుతుంది.…
