పుడమి తల్లి భావాల మాల, నీలాల మేఘమాల
‘ఓహో… మేఘమాలా… నీలాల మేఘమాల’ అంటూ ప్రియ సఖి, సఖుడిని ఉద్దేశించి పాడిన నాయికా నాయికలకు తెలుగు సినిమాలలో కొదవలేదు. ‘నీలి మేఘమా.. జాలీ చూపుమా… ఒక నిమిషమాగుమా’ అంటూ అర్ధించేది ఒకరయితే, ‘మనసు తెలిసిన మేఘమాలా’ అంటూ తమ గోడు చెప్పుకున్న బావా మరదళ్లు మరొకరు. పక్షులకే గాక ప్రేమ పక్షకులకు కూడా నేస్తాలయిన మేఘాలు మానవ సమాజానికి ప్రకృతి ప్రసాదించిన అద్వితీయమైన వరం. ప్రపంచ వ్యాపితంగా వివిధ వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా ఏర్పడిన మేఖాల…
