అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ…