పాకిస్ధాన్ ‘మెమో గేట్’ పాక్ ఆర్మీ కుట్రా?

పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ…