అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా
తాలిబాన్ తో జరుగుతున్న చర్చల్లో అమెరికా ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తుండగా, తమ సుప్రీం నాయకుడి కోసం ‘రాజ్యాంగ హోదా’ కావాలని తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. గ్వ్యాంటనామో బే లో ఖైదీగా ఉన్న తమ నాయకులను, కమాండర్లనూ విడుదల చేయాలనీ, కీలు బొమ్మ కర్జాయ్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందేననీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. ఋణ సంక్షోభం, మళ్ళీ రిసెషన్ లోకి జారిపోతుందేమోనని భయపెడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం లాంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా,…
