విమర్శల రాయి విసురు, నిధుల పండ్లు రాలు -కార్టూన్
రాజకీయాలు పెద్దోళ్లు-పెద్దోళ్లు ఆడుకోవడానికే గానీ జనాల అవసరాలు తీర్చడానికా? ఎన్నికల మేనిఫెస్టోలు, నాయకుల ప్రసంగాలు, పార్టీల రాజ్యాంగాలు ఇవన్నీ జనం పేరు చెప్పకుండా ఒక్క వాక్యాన్నీ ముగించలేవు. అదే చేతల్లోకి వస్తే జేబులోకి (ఆదేలెండి, ఖాతాలోకి) కాసు రాలకుండా ఒక్క అడుగూ ముందుకు పడదు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల సాగించిన బురద రాజకీయం ఆ సంగతే చెబుతోంది. రెండు రోజుల పాటు ములాయం సింగ్ కాంగ్రెస్ పైన నోటితో నిప్పులు విరజిమ్మాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్నాడు.…

