ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…
