దేశంలోని టెర్రరిస్టులే ముంబై పేలుళ్ళకు బాధ్యులు కావొచ్చు -హోం మంత్రి

జులై13 తేదీన ముంబైలో చోటు చేసుకున్న మూడు వరుస పేలుళ్ల వెనక దేశంలోపలి టెర్రరిస్టు మాడ్యూల్సే బాధ్యులు అయి ఉండవచ్చని కేంద్ర మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంటుకు తెలిపాడు. ముంబైలో మూడు చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత దేశంలో తలెత్తిన టెర్రరిస్టు మాడ్యూళ్ళు ఈ పేలుళ్లకు బాధ్యులని చెప్పడానికి సూచనలు వెల్లడయ్యాయని తెలిపాడు. “ఇంకా…

ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్

ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా…

7/11 (జులై 2011) ముంబై బాంబు పేలుళ్ళు -ది హిందూ ఫొటోలు

జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం…