ముంబై దాడులపై పాక్ కోర్టు విచారణ: దాడుల పర్యవేక్షకుని గొంతుతో పాక్ నిందితుడి గొంతు సరిపోలింది
ముంబై టెర్రరిస్టు దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులలో ఒకరి గొంతు ముంబై దాడులను పాకిస్ధాన్ నుండి పర్యవేక్షించిన వ్యక్తి గొంతుతో సరిపోలిందని పాకిస్ధాన్ పోలీసు సాక్షి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్ధాన్ కి చెందిన యాంటి టెర్రరిజం కోర్టు (ఎ.టి.సి) ముంబై దాడులపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును…