తిరుగుబాటులో చీలిక! లిబియా దాడిలో పట్టు కోల్పోతున్న నాటో?

లిబియాలో తిరుగుబాటుగా చెబుతున్న యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు వైమానిక దాడులతో మద్దతు, సహకారం ఇస్తున్నప్పటికీ లిబియా తిరుగుబాటుదారులు ముందంజ వేయడంలో విఫలమవుతుండం పశ్చిమ రాజ్యాలను నిరాశకు గురి చేస్తోంది. తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రారంభ దినాల్లొనే లిబియా తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయిన మిలటరీ కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్యతో లిబియా తిరుగుబాటుదారుల్లో ఉన్న విభేదాలు లోకానికి వెల్లడయ్యాయి. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న కమాండర్ ను వెనక్కి పిలిపించి మరీ హత్య చేయడతో…