పెళ్ళి మాటున జన సమీకరణ, మిలియన్ మార్చ్ కోసం న్యూడెమొక్రసీ ఎత్తుగడ

మిలియన్ మార్చ్ కోసం పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. “ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడుతుందనే మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు తప్ప వేరేదానికి కాదు” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మార్చ్ అనంతరం ప్రకటించిన విషయం వార్తా ఛానెళ్ళలో ప్రసారం కావడం కూడా అందరూ చూశారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం మేరకే పోలీసులు తెలంగాణ అంతటా ఎవరూ హైద్రాబాద్ కు రాకుండా నిర్బంధించారనేది అర్ధం అవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం…

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు

తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది. సంఘటనల క్రమం ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు…

విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు

గురువారం “మిలియన్ మార్చ్” సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చివేశారని డిజిపి ప్రకటించడం సరికాదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఓ విలేఖరితో మాట్లాడుతూ ఖండించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా డిజిపి ప్రకటన జారీ చేయడం తగదని ఐ.ఎఫ్.టి.యు జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ హైద్రాబాద్ లో ఈటివితో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. టాంక్ బండ్ ప్రదర్శనలో అన్ని పార్టీలు, సంఘాల వారు పాల్గొన్నారనీ, పైగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు ప్రతిజ్గ్న చేసిన వెంటనే తిరిగి వచ్చారు తప్ప…

మిలియన్ మార్చ్ లో అపశృతులు, పోలీసులూ, ప్రభుత్వానిదే బాధ్యత

తెలంగాణ వాదులు గురువారం, మార్చి 10 తేదీన తలపెట్టిన “మిలియన్ మార్చ్” విజయవంతం అయిందని తెలంగాణ జెఏసి ప్రకటించింది. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అయితే కార్యకర్తలు టాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోకపోయినట్లయితే ప్రశాంతంగా జరిగి ఉండేదని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. జెఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు జెఏసి ఆఫీసు…

తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…