ముబారక్ నియమించిన ఈజిప్టు ప్రధాని రాజీనామా
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు తన చివరి రోజులలో నియమించిన ప్రధాని అహ్మద్ షఫిక్ గురువారం రాజీనామా చేశాడు. ముబారక్ కు సన్నిహితుడుగా భావిస్తున్న షఫిక్ తొలగింపు కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి. మిలట్రీ కౌన్సిల్ షఫిక్ రాజీనామాను ఆమోదించినట్లుగా తన ఫేస్ బుక్ పేజీ లో ప్రకటించింది. రవాణా శాఖ మాజీ మంత్రి ఎస్సామ్ షరాఫ్ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లుగా కూడా కౌన్సిల్ తెలిపింది. సోమవారం నాడు ముబారక్, అతని కుటుంబ…