ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ
ఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్…
