నాటో “డ్రోన్ హెలికాప్టర్” ను కూల్చివేసిన లిబియా సైన్యం

మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం…