ఫేస్ బుక్ నుండి బలవంతపు అదృశ్యం -కార్టూన్
కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది. ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు…
