భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్
“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్” పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…