ఇండియా, చైనాల్లో కార్ల కొనుగోలు వల్లనే ఆయిల్ రేట్లు పెరగడం -ఒబామా
అమెరికాలో జనం లాగానే ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాల్లోని జనం కూడా కార్లు కొనడం ఎక్కువయిందనీ అందువల్లనే ఆయిల్ ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయనీ ఒబామా కొత్త సంగతి కనిపెట్టాడు. అక్కడికి కార్లు కొని సుఖపడే యోగం అమెరికా ప్రజల సొంతమైనట్లు. వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, అవినీతి, దోపిడి లవల్ల తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులను పరిష్కరించలేక మూడో ప్రపంచ దేశాలపై పడి ఏడ్వడం అమెరికా, యూరప్ లకు మామూలైపోయింది. తమ కంపెనీల దుర్మార్గాన్ని…
