బంగాళాఖాతం వివాదం: ఐరాస బంగ్లాదేశ్ అనుకూల తీర్పు
మూడు దశాబ్దాల నాటి సముద్ర జలాల సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి సంస్ధ ఒకటి ఇండియాకు వ్యతిరేకంగానూ, బంగ్లాదేశ్ కు అనుకూలంగానూ తీర్పు చెప్పింది. పొరుగు దేశాలతో వివాదాల్లో హిందూ-ముస్లిం సెంటిమెంట్లను చొప్పించి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇండియా వైపే మొగ్గు చూపాలని వాదించే బి.జె.పి/ప్రధాని మోడి ఆశ్చర్యకరంగా తీర్పును స్వాగతించారు. ప్రమాణ స్వీకారం రోజే సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపి స్నేహ పూర్వక పొరుగు సంబంధాలకు ప్రాధాన్యతను ప్రకటించిన మోడి ఆ అవగాననే ఐరాస తీర్పు సందర్భంగానూ…