మిన్స్క్ ఒప్పందాన్ని ఖాతరు చేయని ఉక్రెయిన్ -3

ఫిబ్రవరి 13 తేదికల్లా మరొవార్త. అమెరికా, రష్యా అధ్యక్షులు గంట పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఆ వార్త సారాంశం. బైడెన్ మళ్ళీ అదే పాట. “ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే అమెరికా మరిన్ని అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తుంది” అని. “రష్యా దాడి చేస్తే పశ్చిమ రాజ్యాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి” అనీను. పుతిన్ సమాధానం “రష్యా ఆందోళనలను పరిగణించడంలో అమెరికా విఫలం అవుతోంది” అని. “నాటో విస్తరణ పైనా, ఉక్రెయిన్ లో…