సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…