(మావో ధాట్) మావో ఆలోచనా విధానం అంటే? -2
అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో మేజార్టీ ప్రజలకు భూమి పధాన ఉత్పత్తి సాధనంగా, శ్రమ సాధనంగా కొనసాగుతుంది. కానీ భూస్వామ్య వర్గాలదే పూర్తి ఆధిపత్యం కాదు. వారిలో కొందరు పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందుతారు. కొంతమంది గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్నాల్లో పెట్టుబడిదారీ వర్గంలోకి ప్రవేశించారు. భారత దేశంలో ఇలాంటి అనేకమందిని మనం చూడగలం. [భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ‘కుల వ్యవస్ధ’ ప్రధాన పట్టుగొమ్మ. కులం పునాదులు బలహీనపడుతున్నాయని చెబుతున్నప్పటికీ అగ్ర కుల భూస్వామ్య వర్గ…

