హింస కాదు ప్రతి హింస: అరుంధతీ రాయ్ -3

రెండో భాగం తరువాయి………….. సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా? అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు…

అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…

సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…

గాంధేయవాదులు కూడా బహిష్కృతులే -గాంధియన్ హిమాంషుతో ఇంటర్వ్యూ

హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను…

ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం

మావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 1

కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గడ్డి పెట్టినంత పని చేసింది. ఛత్తిస్ ఘఢ్ లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి గిరిజన తెగల్లోనే ఒక తెగకు శిక్షణ ఇచ్చి తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా పేరుపెట్టి రిగిజనంపైకి వదిలింది. దీనివలన గిరిజన తెగల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తి ఒక తెగపై మరొక తెగ దారుణంగా మారణ కాండకు తలపడడం మొదలైంది. గిరిజనులకూ, గిరిజనులకూ పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వినోదం చూశాయి. ఈ పద్దతిని…