బి.జె.పి పై రాస్తే వికీలీక్స్ అబద్ధం, మాయావతిపై రాస్తే పక్కా!
రాజకీయ పార్టీల ద్వంద్వ విలువలు భారత ప్రజలకి కొత్త కాదు. అయినా తమ ద్వంద్వ విధానాలు ప్రజలు మర్చిపోతారేమో అన్నట్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా అవి తమ బుద్ధిని బైట పెట్టుకుంటూ ఉంటాయి. ద్వంద్వ ప్రమాణాల విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టైలు. కొంతమంది చాలా తెలివిగా ద్వంద్వ ప్రమాణాలు అని తెలియనంతగా చెలాయిస్తే, మరి కొందరు తాము నిన్నొక మాట అన్నామన్న సంగతి తామే మర్చిపోయినట్లుగా మరుసటి రోజే దానిని మార్చేస్తూ ఉంటారు. మీడియాపైకి నెట్టేయడం రాజకీయులకి…