ట్రంప్ టారిఫ్ మేనియా: వెర్రిబాగులతనమా లేక ప్రణాళికాబద్ధమా? -పార్ట్ 1

—–న్యూ డెమోక్రసీ పత్రిక నుండి, (అనువాదం: విశేఖర్, సెప్టెంబర్ 7) తన స్వాధీన విధానం (mode of acquisition) లో మరియు తన సౌఖ్యాలలో ద్రవ్య కులీన వర్గం అన్నది, బూర్జువా సమాజం సమున్నత స్థాయిలో, లంపెన్ కార్మిక వర్గం తిరిగి పునర్జన్మ పొందడమే. -కారల్ మార్క్స్ ———- డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రంధిలో పడ్డాడు. టారిఫ్ లు మోపడం అంతలోనే వాటిని స్తంభింపజేయటం, వివిధ దేశాల నుండి వచ్చే దిగుమతుల పైన టారిఫ్ రేట్లు పెంచటం…