చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…

అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది.…

కొత్త వీసా రూల్స్ తో మోడిని రాకుండా చెయ్యండి -బ్రిటన్ మానవ హక్కుల సంస్ధలు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి. నరేంద్ర మోడి…

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని…

వేశ్యల మానవ హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ పెదవులు కలిపి కుట్టుకున్న మహిళ -ఫోటో

జూన్ 15 న బొలీవియాలో చోటు చేసుకున్న దృశ్యం ఇది. తమ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నందుకు నిరసనగా అక్కడి వేశ్యలు, మహిళా వెయిటర్లు, వేశ్యా గృహాల ఓనర్లూ ఈ విధంగా పెదవులు కలిపి కుట్టుకుని నిరసనకు పాల్పడ్డారు. రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ ఫోటోను ప్రచురించింది. బోలీవియాలోని “లా పాజ్” నగరంలో ఈ నిరసనలో పాల్గొన్న మహిళ ఈమె వేశ్యా వృత్తిలో ఉన్నట్లుగా స్ధానిక పోలీసులు తెలిపారని రాయిటర్స్ తెలిపింది.