అమెరికా: ఇలాంటి యుద్ధ వికలాంగులు ఇంకెందరో? -ఫోటోలు

ఇతని పేరు మాట్ కృమ్వీడ్. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధ బాధితుడే కానీ ఆఫ్ఘన్ కాదు. ఒక యువ అమెరికన్. అమెరికన్ బహుళజాతి బ్యాంకులు, కంపెనీల దురాశా పీడితుడు అంటే సబబుగా ఉంటుంది. వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల అనంత దాహాన్ని తీర్చడానికే అమెరికా రాజ్యం ప్రపంచ దేశాలపైకి దండెత్తి వెళుతుందని గ్రహిస్తే మాట్ బలవంతపు వైకల్యానికి కారణం ఎవరో తెలియడానికి పెద్దగా జ్ఞానం అవసరం లేదు. కానీ అమెరికా పత్రికలు మాత్రం ఆఫ్ఘన్ స్వతంత్ర కాంక్షాపరులను టెర్రరిస్టులుగా…