పనస పండు దొంగ కోసం పోలీసుల ఉరుకులు
‘రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని సామెత. మన ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఆధునిక రాజులు కదా, వారు తలచుకున్నా అదే పరిస్ధితి సంభవించగలదు. లేకపోతే ఎం.పి గారి ఇంటి ఆవరణలోని పనస చెట్టు నుండి పనస పండ్లను దొంగిలించిన దొంగ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఆధునిక అపరాధ పరిశోధన పద్ధతులన్నీ ప్రయోగించడం… ఎలా అర్ధం చేసుకోవాలి? ఎఎపి ప్రభుత్వం విదేశీ వ్యభిచార గృహాలపై దాడులు చేయమన్నా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగిన…