కొడుకు చేసిన తప్పుకి తల్లిని నగ్నంగా ఊరేగించిన పాకిస్తాన్ గ్రామస్దులు
కొడుకు చేసిన తప్పుకి అతని తల్లి కక్షిదారుల చేతిలో అవమానం ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్ధాన్ లోని “ఖైబర్ పక్థూన్‌ఖ్వా” రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పాకిస్ధాన్ పోలీసులు చెబుతున్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణతో అతన్ని చంపడానికి ఆయుధాలతో వెళ్ళిన సంబంధీకులు నలుగురు, అతను ఇంటివద్ద లేక పోవడంతో అతని తల్లిని వివస్త్రను గావించి గ్రామంలో ఊరేగించారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉండడంతో…