మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…