ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన
జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన…


