మొరాకోలో రాజకీయ సంస్కరణలు కోరుతూ ప్రదర్శనలు
గత డిసెంబరులో ట్యునీషియాలో ప్రారంభమై అక్కడి అధ్యక్షుడిని జనవరికల్లా దేశం నుండి పారిపోయేలా చేసిన అరబ్ ప్రజా ఉద్యమ తుఫాను కొద్దో గొప్పో ధనిక దేశమైన మొరాకోను సైతం తాకింది. మొరాకో రాజు మొహమ్మద్ VI, తన అధికారాల్లో కొన్నింటిని వదులుకొని ప్రజాస్వామిక పరిపాలనకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తూ మొరాకో ప్రజలు దేశం లోని వివిధ పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని “రాబత్” లో ప్రదర్శన పార్లమెంటు వరకు వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. “బానిసలకోసం…