మహబూబ్ నగర్ పల్లెలో ‘ఐ-పలకల’ విప్లవం–ఫోటోలు
కంప్యూటర్ల నుండి మొబైల్ ఫోన్ల వరకూ సమాచార సాంకేతిక విప్లవం మానవ జీవనాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలం మనది. దేశ దేశాల సాంస్కృతిక జీవనంలోకి కూడా చొరబడి మధ్య తరగతి యువతీ, యువకుల చేత కిడ్నీలను అమ్మిస్తున్న ఐ-ఫోన్ల కాలం కూడా మనదే. బిట్లు, బైట్లుగా కాపర్ తీగల్లో ప్రవహిస్తున్న సాంకేతిక విప్లవ ఫలితం భారత దేశ పల్లెలకు అందని ద్రాక్షగా భావించవచ్చు గానీ, మహబూబ్ నగర్ జిల్లా లోని మహమ్మద్ హుసేన్ పల్లి విద్యార్ధులు అందుకు మినహాయింపు…
