ఇంకా తేరుకోని బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ లో రాజకీయ మరియు శాంతి భద్రతల పరిస్ధితులు ఇప్పటికీ మెరుగుపడ లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రధాన పాలనా బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. 15 యేళ్ళ పాటు సాగిన షేక్ హసీనా పాలన మిగిల్చిన వైరాలు, వైరుధ్యాలు, పగలు-ప్రతీకారాలు నివురు గప్పిన నిప్పులా తమ ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి. బహుశా…




