రాజకీయ సంస్కరణల కోసం లక్ష మంది మలేసియన్ల ప్రదర్శన
మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించినవారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రసాయనాలు కలిపిన నీళ్ళు ప్రదర్శకులను చెదర గొట్టారు. ఎన్నికల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలనీ, పాలక పక్షం పట్ల పక్షపాతం వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను సంస్కరించాలనీ, విదేశాల్లో ఉన్న మలేసియన్లకు కూడా ఓటు హక్కు కల్పించాలనీ ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలో లక్ష మంది పాల్గొన్నారని మలేసియా పత్రిక ‘ది సన్’ తెలుపగా 80,000 పైగా పాల్గొన్నారని…
