పేలలేదు, కూలలేదు -ఐరాస
మలేషియా విమానం ‘ఫ్లైట్ MH370’ గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐరాసకు చెందిన సంస్ధ CTBTO ప్రకటించింది. ‘సమగ్ర (అణు) పరీక్షల నిషేధ ఒప్పంద సంస్ధ’ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కూలిపోయిన జాడలు గానీ, పేలిపోయిన జాడలను గాని రికార్డు చేయలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ ప్రకటించారు. విమానం సముద్రంలో కూలినా, నేలపై…