సముద్రంలోనే కూలింది, నిర్ధారించిన మలేషియా ప్రధాని
ఎట్టకేలకు మలేషియా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. తమ పౌర విమానం MH370 హిందూ మహా సముద్రంలో ఎవరూ పెద్దగా సంచరించని చోట కూలిపోయిందని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో నిరూపించిందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీర నగరం పెర్త్ కు పశ్చిమ దిశగా 2,000 కి.మీ దూరంలో విమానం కూలిపోయిందని, ప్రమాదంలో ఎవరూ బతికి బట్టకట్టలేదని తాము భావిస్తున్నామని తెలిపారు. విలేఖరుల సమావేశానికి కొద్ది నిమిషాలకు…