భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…

‘మమత’ సవరణలతో లోక్ పాల్ బిల్లు బడ్జెట్ సమావేశాలకి వాయిదా పడే ప్రమాదం

రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. యు.పి.ఎ భాగస్వామి త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించిన సవరణలకు ప్రతిపక్ష పార్టీలలో కూడా మద్దతు దొరకడంతో ప్రస్తుత సమావేశాలలో లోక్ పాల్ బిల్లు ఆమోదం కష్టంగా కనిపిస్తోంది. బిల్లుకు తలపెట్టిన సవరణలతో సహా, లోక్ పాల్ బిల్లు, మరొకసారి స్ధాయీ సంఘం పరిశీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. చూడగా, ఎన్.డి.టి.వి విశ్లేషణ అంతిమంగా నిజమయ్యేలా పరిస్ధితి కనిపిస్తోంది. రాష్ట్రాలు…