మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం
అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…

