మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే…

రాహుల్ రేటింగ్ AAA, మన్మోహన్ రేటింగ్ AA+ -కార్టూన్

అట్లాంటిక్ సముద్రానికి అవతల ఒడ్డున అమెరికా రేటింగ్‌ని, స్టాండర్డ్ & పూర్ సంస్ధ AAA నుండి AA+ కి తగ్గించింది. హిందూ మహా సముద్రానికి ఇవతలి ఒడ్డున భారత ప్రజలు ప్రధాని మన్మోహన్ రేటింగ్‌ని AAA నుండి AA+ కి తగ్గించేశారు. అదే చేత్తో ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ రేటింగ్ లు ఏమీ లేని రాహుల్ గాంధీకి అమాంతం AAA రేటింగ్ ఇచ్చేశారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ మరియు సి.ఎన్.బి.సి-టి.వి18 సంస్ధల  ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్’ ను,…