హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…

కాంగ్రెస్ వర్కింగ్ ఫార్ములా -కార్టూన్

కాంగ్రెస్ ప్రభుత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వ పని తీరుపై ‘ది హిందు’ పత్రిక మరో కార్టూన్ బాణం విసిరింది. అవినీతి స్కాముల మూటలు మోస్తూ, సోనియమ్మ చేతిలో కళ్ళెం పట్టుకుని అదపు చేస్తుంటే, ‘మిస్టర్ క్లీన్’ భారంగా బండి లాగుతున్న దృశ్యం, పరిస్ధితిని కళ్ళకు కడుతోంది. కానయితే స్కాములు ప్రధానికి నిజంగా భారమా లేక ఆయనకు తెలిసీ జరుగుతున్నాయా అన్నది చర్చాంశం. 2జి స్కాము మన్మోహన్ కి తెలిసే జరిగిందనీ, జరగబోతున్నది తెలిసినా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఇటీవల…