స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…

బిజెపి కేసుల బండారం బైట పెట్టిన సిసోడియా బెయిల్!

ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్, బిజెపి/మోడి ప్రభుత్వం (ఇడి, సిబిఐ) కనిపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసింది. ‘బెయిల్, నాట్ జెయిల్, ఈజ్ ద రూల్’ అని జస్టిస్ బి. ఆర్. గవాయ్, కెవి విశ్వనాధన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పై విడుదలయిన మనీష్ సిసోడియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…