కేజ్రీవాల్ కి బెయిల్

ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా…

బిజెపి కేసుల బండారం బైట పెట్టిన సిసోడియా బెయిల్!

ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్, బిజెపి/మోడి ప్రభుత్వం (ఇడి, సిబిఐ) కనిపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసింది. ‘బెయిల్, నాట్ జెయిల్, ఈజ్ ద రూల్’ అని జస్టిస్ బి. ఆర్. గవాయ్, కెవి విశ్వనాధన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పై విడుదలయిన మనీష్ సిసోడియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న…

అధికారుల సస్పెన్షన్: ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ ల సామూహిక సెలవు

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఏ‌ఏ‌పి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…