మధ్య ఆసియా: మూసివేత దిశలో కిర్ఘిస్తాన్ అమెరికా ఆర్మీ బేస్

మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను…