బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి

మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు…