ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం
మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన…